పశ్చిమ నుంచి సీపీఐ అభ్యర్థి అత్తిలి విమల నామినేషన్

72చూసినవారు
పశ్చిమ నుంచి సీపీఐ అభ్యర్థి అత్తిలి విమల నామినేషన్
కేంద్రంలో బిజెపిని, ఆ పార్టీకి ఊడిగం చేస్తున్న వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలను ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి కోరారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి సిపిఐ అభ్యర్థిగా అత్తిలి విమల శనివారం నామినేషన్ దాఖలు చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సిహెచ్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపిని గద్దె దించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్