విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో 2024-25 మొదటి అర్థ సంవత్సరానికి సంబంధించిన ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులు సెప్టెంబర్ 30వ తేదీ లోగా చెల్లించాలని జివిఎంసి కమిషనర్ సంపత్ కుమార్ శనివారం నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. పన్నులు సకాలంలో చెల్లించిసహకరించాలని కోరారు. పన్ను వసూళ్లకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, అన్ని జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో పన్నులు చెల్లించివచ్చాన్నారు.