అచ్యుతాపురం ఎస్ఈజెడ్ పరిధిలో ఎస్. వి పరిశ్రమలో ఇటీవల పడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందిన కృష్ణ చైతన్య కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. రాము డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని శుక్రవారం పరిశ్రమ వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేయగా పట్టించుకోలేదని అన్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.