వృద్ధిరేటులో ఏపీని రెండో స్థానంలో ఉంచడం ప్రస్తుతం తన ముందు ఉన్న కొత్త సవాల్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సవాల్‌ను అవకాశంగా భావిస్తున్నాం.. మరింత కష్టపడి పనిచేస్తామని సీఎం తెలిపారు. మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 'సీఎంగా నా తొలి ప్రయాణం మొదలైనప్పుడు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్.. నేడు అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ 1 నగరంగా ఉంది.'అని అన్నారు.