తుంగభద్ర డ్యామ్ గేటును పునరుద్ధరిస్తామని ఏపీ మంత్రులు రామానాయుడు, పయ్యావుల కేశవ్ తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి డ్యామ్‌ను పరిశీలించారు. చైన్ కట్ కావడంతోనే 19వ గేట్ కొట్టుకుపోయినట్లు తెలిపారు. ఆ గేట్ నుంచి 35 వేల క్యూసెక్కుల నీరు వెళ్తోందని చెప్పారు. డ్యామ్‌లో నీటి మట్టం తగ్గాకే పునరుద్ధరణ సాధ్యమని, నారాయణ ఇంజినీరింగ్ ఏజెన్సీ ఆ పనులు చేపడుతుందని తెలిపారు.