బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ఒకరోజు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. తొలి టెస్టు కోసం యువ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్‌ను భారత జట్టులో చేర్చుకుంది. గాయపడిన శుభ్‌మన్ గిల్ స్థానంలో పడిక్కల్‌ను తీసుకున్నారు. వార్మప్ మ్యాచ్ సమయంలో గిల్ వేలికి గాయమైంది. స్కానింగ్‌లోనూ చీలికలు వచ్చినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.