దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, అదానీ గ్రూప్ ఛైర్మన్‌పై అమెరికాలో అభియోగాల నేపథ్యంలో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. నిఫ్టీ 168.60 పాయింట్ల నష్టంతో 23,349.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 7 పైసలు క్షీణించి 84.49కు చేరింది.