బలహీనపడిన వాయుగుండం.. ఆ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

75చూసినవారు
బలహీనపడిన వాయుగుండం.. ఆ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇవాళ మన్యం, అల్లూరి , కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్