పెనుగొండ మండలం వడలి గ్రామంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గ్రామపంచాయతీ వద్ద పతాక ఆవిష్కరణ అనంతరం అమరవీరుల పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ ప్రజలందరి సమక్షంలో పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. అనంతరం సొసైటీ వద్ద జెండా వందనం స్వీకరించారు. జడ్పీ హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.