ఆవులు, గేదెలను రోడ్లపైకి వదిలితే చర్యలు: కలెక్టర్

66చూసినవారు
ఆవులు, గేదెలను రోడ్లపైకి వదిలితే చర్యలు: కలెక్టర్
ప. గో. జిల్లాలో ఎక్కడైనా రోడ్లపైకి ఆవులను, గేదెలను వదిలితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. మంగళవారం భీమవరం కలెక్టరెట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పశువుల కారణంగా జాతీయ రహదారులు, పట్టణాల్లో ఎక్కువగా యాక్సిడెంట్లు అవడం, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందన్నారు. వాటి యజమానులకు ముందుగా సమాచారం అందించి హెచ్చరికలు జారీ చేయాలని, మార్పు రాకపోతే ఆవులను గోశాలలకు తరలిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్