మన ఇళ్లు–మన గౌరవం కార్యక్రమంలో భాగంగా, శనివారం భీమవరం లోని విస్సకొడేరు లేఅవుట్లో గృహ నిర్మాణ లబ్దిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తున్నఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు,అధికారులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో గృహ నిర్మాణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లబ్ధిదారులు గృహాలు నిర్మించి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని సూచించారు.