తాడేపల్లిగూడెం పట్టణంలోని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద బుధవారం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గా నియమితులైన సందర్భంగా కేక్ కట్ చేశారు. కూటమి నాయకులు బొలిశెట్టి రాజేష్, ఈతకోట తాతాజీ, వర్తనపల్లి కాశి మాట్లాడారు. శ్రీనివాస్ కు ప్రభుత్వ విప్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు పుల్లా బాబి, సురేష్ రెడ్డి పాల్గొన్నారు.