పెదతాడేపల్లి లోటస్ హై స్కూల్ విద్యార్థులు మరొకసారి తమ దాతృత్వాన్ని చాటారు. లోటస్ స్కూల్ విద్యార్థులు ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి మేము సైతం సాయం అందిస్తామని గత రెండు రోజులుగా ప్రతి విద్యార్థి తమ బంధువులు స్నేహితులు పొరుగువారి నుండి విరాళాల సేకరణ చేపట్టారు. తద్వారా 5 లక్షల 60 వేల రూపాయలను చెక్ ను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కి పార్టీ కార్యాలయంలో గురువారం అందించారు.