ఇన్ పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ నిధులు విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేసిందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. శుక్రవారం తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతన్నను ఆదుకునేలా బడ్జెట్లో ఒక రూపాయి కూడా ప్రవేశ పెట్టలేదన్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.