తణుకు జాతీయ రహదారిపై డిమార్ట్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారి అడ్డగర్ల సుబ్రహ్మణ్యం (45) బైక్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతదేహం నుజ్జునుజ్జైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.