బాలుడు అదృశ్యంపై కేసు నమోదు

62చూసినవారు
బాలుడు అదృశ్యంపై కేసు నమోదు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడుకు చెందిన పదహారేళ్ల బాలుడు పాల ఆనంద్ 10వ తరగతి చదివి ఇంటి వద్ద ఉంటున్నాడు. అతడు ఈ నెల 27న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో అతడి తల్లి మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్