పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం మోగల్లు రోడ్డు గంగాదేవి గుడి సమీపంలో ఉత్తర పొలాల వైపు గోస్తనీ నది గట్టు కోతకు గురై వరద నీటి ప్రవాహం గ్రామంలోకి ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన గ్రామ పెద్దలు రైతులు కూటమి నాయకులు గట్టును పటిష్టం చేసేందుకు ప్రోక్లైన్ తీసుకువచ్చి తక్షణ చర్యలు చేపట్టారు. దీంతో గ్రామస్తులు రైతులు ఊపిరి పీల్చుకున్నారు.