ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఏలూరుపాడులో అంబేడ్కర్ ఫ్లెక్సీ వివాదంపై శనివారం స్పందించారు. గ్రామంలో అటుగా వెళుతున్న సమయంలో అక్కడ ఉండే నాగేంద్ర స్వామి పుట్టను మూసేసి అంబేడ్కర్ ఫ్లెక్సీ కట్టారు. అలాగే పుట్టపై ఇద్దరు కూర్చొని ధూమపానం చేశారు. అది చూసి ఫ్లెక్సీని తొలగించాను. అంతే కానీ అంబేడ్కర్ అంటే నాకు చాలా ఇష్టం అలాగే భక్తి అని ఆయన స్పష్టం చేశారు.