పెనుగొండ మండలం వడలి గ్రామం నందు పెనుగొండ ఈఒపిఆర్డి సియస్వీ రెడ్డి ఆధ్వర్యంలో మనం మన పరిశుభ్రత & జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా తడిచెత్త మరియు పొడిచెత్త గూర్చి ప్రజలకు పూర్తి అవగాహన సదస్సు నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా వడలి పంచాయతీ కార్యదర్శి 1 పిఎ రామకృష్ణ మాట్లాడుతూ మన గ్రామంలో వీధులు, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. మీ ఇళ్ళలో వచ్చే చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేస్తే అందులో దోమలు నివాసం చేస్తాయి. చెత్తకుళ్ళి దుర్గంధం రావటం వలన, దోమలు కుట్టటం వల్ల జ్వరాలబారినపడి ప్రాణాపాయ పరిస్థితులు ఎదురౌతాయి. కాబట్టి చెత్తను మీవీధిలోకి వచ్చే మా చెత్తబండి సిబ్బందికి తడిచెత్త ను , పొడి చెత్త వేరువేరుగా అందజేయండి. అలా చేయడం వల్ల పొడిచెత్తలో ఉండే ప్లాస్టిక్ పర్యావరణానికి హాని కలుగజేయు కుండా దానిని రీసైక్లింగ్ చేయుటకు వీలగుతుంది. ఇందుకు గ్రామ ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వడలి పంచాయతీ కార్యదర్శి 2 యస్ గణేశ్వరరావు మాట్లాడుతూ చెత్తను ఎలా పడితే అలా పారవేయడంవలన డ్రైనేజిలు జామ్అయిపోయి నీరు నిలువ ఉండటం వలన దోమలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజలు అవగాహన చేసుకుని ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ఆరొగ్యవంతమైన సమాజస్థాపన కు బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్: కాసాని విజయ లక్ష్మి , ఎంపీటీసీలు: రెడ్డి గణేశ్వర రావు , చిటికెన దుర్గ భవాని, పంచాయతీ మరియు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు , ప్రజలు పాల్గొన్నారు.