ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఆగ్రో లోగోలతో నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు సృష్టించి మోసాలు జరుగుతున్నాయని పెనుమంట్ర మండలం మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు తీసుకోరని, అలా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.