ప. గో. జిల్లాలోని కర్మాగారాల్లో కట్టుదిట్టమైన ప్రమాద రహిత భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత యాజమాన్యాలను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్ లో పరిశ్రమల్లో తీసుకోవాల్సిన ప్రమాద రహిత భద్రతా చర్యలపై సంబంధిత అధికారులు, పరిశ్రమల యజమానులతో సమీక్షించి మాట్లాడారు. జిల్లాలోని 53 పరిశ్రమల్లో రెండు పరిశ్రమలు ‘ఏ’ కేటగిరి కింద, 51 పరిశ్రమలు ‘బి’ కేటగిరి కింద నమోదు చేయడం జరిగిందన్నారు.