కాలం చెల్లిన బస్సులు, వయసు మళ్ళిన డ్రైవర్లతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం బుధవారం భీమవరంలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. ఇటీవల ప్రైవేట్ విద్యాసంస్థ బస్సు అతి వేగం కారణంగా విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడన్నారు. పాలకోడేరులో అతివేగంతో మరో బస్సు బెండ తోటలోకి వెళ్ళిపోయి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు.