75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కలెక్టరేట్ ప్రాంగణంలోని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. అనంతరం వశిష్ట సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో అత్యద్భుతమైన రాజ్యాంగన్ని అంబేద్కర్ నిర్మించడం జరిగిందన్నారు.