ప. గో. జిల్లాలోని భీమవరంలో 1100 మంది విద్యార్థులకు ఉపయోగపడే కళావేదికను ఆదివారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ప్రారంభించారు. ఈ కళావేదిక విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కళలు అభివృద్ధి చెందడంలో కీలకంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కళావేదిక నిర్మాణం అభినందనీయమని ఆయన తెలిపారు.