భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజి బాబును నూతన జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పదో తరగతి ఫలితాల్లో జిల్లా ప్రథమస్థానంలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నిరంతరం కృషి చేయాలని, విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.