వరద బాధితులకు దాతలందిస్తున్న సహకారం వెలకట్టలేనిదని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణానికి చెందిన మావుళ్ళమ్మ మిక్చర్ బండ్ల సంఘం రూ. 20 వేలు సహకారాన్ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. వరద బాధితులకు సహాయార్ధం మిక్చర్ బండ్ల సంఘం సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.