ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేటి నుండి కార్తీక మాసం మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో తెల్లవారుజాము నుంచి కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం, భీమవరం గునుపూడి సోమేశ్వర ఆలయం, ఆచంట రామేశ్వర స్వామి ఆలయం, గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం, గుంటుపల్లి బౌద్ధ గుహలు కార్తీక మాసం సమయంలో భక్తులతో కిటకిటలాడుతాయి.