ప. గో. జిల్లాలో కొనసాగుతున్న లాటరీ విధానం

66చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ ప్రక్రియను సోమవారం భీమవరం పెద్ద అమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. జిల్లాలోని 175 మద్యం దుకాణాలకు గాను లాటరీ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 5, 627 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్