ప. గో. జిల్లాలో వ్యాధుల నివారణకు జాప్యం లేకుండా అన్ని రకాలుగా చర్యలు ముమ్మరం చెయ్యాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం కోరారు. బుధవారం భీమవరం పరుశ రామిరెడ్డి కళ్యాణ మండపంలో సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. జిల్లాలో భారీ వర్షాలు వలన సీజనల్ వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని వారి కోరారు.