భీమవరం: సామాన్య భక్తులందరికీ దర్శనం కల్పించాలి
కార్తీకమాసంలో శివాలయంకు వచ్చే ప్రతి సామాన్య భక్తునికి శివుని దర్శనం కల్పించాలని, కార్తీకమాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు సంబంధిత దేవాలయ అధికారులకు, పోలీసు అధికారులకు సూచించారు. పంచారామ క్షేత్రమైన శ్రీఉమా సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు.