తెల్లరేషన్ కార్డు ప్రామాణికంగా అర్హులైన లబ్ధిదారులకు ఉచిత సిలిండర్ అక్టోబర్ 31 నుండి అమలు కానున్నట్లు జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 6,21,626 ఎల్పిజి కనెక్షన్లు ఉన్నాయని, అయితే ఎల్పిజి కనెక్షన్, తెల్లరేషన్ కార్డు కలిగి ఆధార్ తో అనుసంధానమైన అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అన్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు చొప్పున ఉచితంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.