భారీ వర్షాలకు బాపట్ల జిల్లా వేములపాడు ఎంఎల్ఎస్ పాయింట్ గోడౌన్ కార్మికులు 16 మంది వరదల్లో చిక్కుకుపోయారు. సంబంధిత అధికారులకు, మంత్రికి తెలియజేసినా స్పందించలేదని ఆరోపిస్తూ భీమవరం ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు నాయకులు నిరసన తెలియజేశారు. గోడౌన్లో చిక్కుకున్న వారిని వెంటనే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.