జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక అంబికా హోటల్ అధినేత ఉక్కుర్తి సీతారాం విజయవాడ వరద బాధితుల సహాయార్థం తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం 50 వేల రూపాయలను స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చిన నగదు ఏవిధంగా ఉపయోగించాలనేది పార్టీ నాయకులతో మాట్లాడి చర్చిస్తామనన్నారు. అలాగే దాతలను ఎమ్మెల్యే అభినందించారు.