ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం శివారులోని బైపాస్ రోడ్డులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్ లో వచ్చిన భారీ ట్రాలీ లారీ కోళ్ళను తరలిస్తున్న వ్యానును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కోళ్ల వ్యాను వెంటనే రహదారి మార్జిన్ లోకి పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.