చింతలపూడి నియోజకవర్గంలో 50, 000 సభ్యత్వాలే లక్ష్యంగా 4 మండలాల నాయకులు పనిచేయాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఆదివారం చింతలపూడి టీడీపీ కార్యాలయంలో నాలుగు మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 50వేల పైబడి సభ్యత్వాల్ని ఎలా చేరుకోవాలని తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.