జంగారెడ్డిగూడెంలో ఉన్న ఓ వస్త్ర దుకాణం ఎదుట బుధవారం ఉద్యోగి నిరసనకు దిగాడు. తనకు జీతాలు చెల్లించకుండా కులం పేరుతో దూషిస్తున్నారంటూ ఆరోపించాడు. విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం ఎస్సై జాబిర్ దుకాణం వద్దకు చేరుకొని బాధితుడి వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దుకాణ అడ్మినిస్ట్రేషన్ వ్యక్తులను, బాధితుడిని స్టేషన్‌కు రమ్మని ఆదేశాలు ఇచ్చారు.