అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు మరియు రాష్ట్ర అభివృద్ధికి అద్దం పట్టేలా ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. జంగారెడ్డిగూడెంలో సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి వార్షిక బడ్జెట్లో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు మంచి నిధులు కేటాయించారని ఆయన తెలిపారు.