కలపర్రు - హనుమాన్ జంక్షన్ వద్ద తాజా పరిస్థితి

74చూసినవారు
పెదపాడు మండలం కలపర్రు టోల్ గేట్ సమీపంలో రెండు వాగులు పొంగి పొర్లడంతో జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ఆదివారం కలపర్రు, హనుమాన్ జంక్షన్ సర్వీస్ రోడ్డు మధ్య వరద ఉద్ధృతి ఉగ్రరూపం దాల్చడంతో నివాసాల్లోకి వర్షపు నీరు చేరుకుంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.

సంబంధిత పోస్ట్