పవిత్ర కార్తీక మాసం సందర్భంగా పెదపాడు శివాలయంలో శనివారం దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు చింతమనేని దంపతులను ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.