పెదవేగి: వ్యక్తిపై దాడి చేసిన ముగ్గురిపై కేసు

62చూసినవారు
పెదవేగి: వ్యక్తిపై దాడి చేసిన ముగ్గురిపై కేసు
పెదవేగి మండలం ముండూరుకు చెందిన బి. చంద్రశేఖర్ కు అదే గ్రామానికి చెందిన కిశోర్, సుధీర్, సందీప్ మధ్య పాత గొడవలున్నాయి. ఈ నెల 13న చంద్రశేఖర్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా. వారు అడ్డుకొని దాడి చేశారు. గాయపడిన ఆయన్ను స్థానికులు ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రివర్గాల సమాచారంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్