పెదవేగి మండలం దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పలు గ్రామాలకు చెందిన ప్రజలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ఆలకించి వారి వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.