ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో మంగళవారం జరిగిన సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కోడిపందాలలో వైఎస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వేంకటరమణ పాల్గొన్నారు. అనంతరం ఆయన పందేలను వీక్షించారు. అలాగే ప్రజలందరూ సుఖసంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.