కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వినతి పత్రం

283చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వినతి పత్రం
ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తాసిల్దార్ కృష్ణ స్వామికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం మండల కార్యదర్శి గుత్తుల శ్రీను మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని అన్ని రకాల పంటలకు మద్దతు ధర గ్యారెంటీ చేస్తూ చట్టం చేయాలని వారు అన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కౌలు, రైతు సంఘం మండల కార్యదర్శి తెచ్చేటి నరసింహమూర్తి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2022 విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని రైతు, కౌలు రైతులకు అన్ని రకాల రుణాలను రద్దు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యలుగా పాల్గొన్న సిఐటి అధ్యక్షులు మేడిశెట్టి పెంటారావు, కెవిపిఎస్ మండల కార్యదర్శి చెన్నం చిన్న నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఢిల్లీ ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని, రైతులపైన పెట్టిన కేసులను ఎత్తివేయాలని వారు అన్నారు. రైతులకు కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్కింపూర్ కేరి జిల్లాలో నలుగు రైతులను ఒక జర్నలిస్టును హత్య కారణమైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, తేనిని వెంటనే క్యాబినెట్ నీకు తొలగించాలని తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్