ఏలూరు జిల్లాలో ఉద్యానవన సాగులో 20% వృద్ధిరేటు సాధించడానికి రైతులను అన్నివిధాలా ప్రోత్సాహాన్ని అందిస్తామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో గురువారం సుస్థిర ఆయిల్ పామ్ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలకు సంబంధించి జిల్లాలో ఆయిల్ పామ్, ఇతర ఉద్యానవన పంటల వృద్ధిపై రైతుల సమస్యలు, ప్రభుత్వ ప్రోత్సాహంపై రైతులకు అవగాహనా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.