ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పోలీస్ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం బ్యాంకు అధికారులతో బ్యాంక్‌ల వద్ద భద్రత, సైబర్ క్రైమ్ నేరాలపై తీసుకోవలసిన జాగ్రత్తలపై బ్యాంక్ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేరం జరిగిన తర్వాత విచారణ చేయడం కంటే ముందస్తుగా దానిని నివారించడం మేలన్నారు. పలు చోట్ల సైబర్ నేరగాళ్లకు బ్యాంకు సిబ్బంది సహకరిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.