ఏలూరు జిల్లాలో కాల్ మనీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద బాధితులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. కాల్ మనీ దందాకు పాల్పడుతున్న ఐదుగురిని వెంటనే అదుపులోకి తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కు వినతి పత్రం అందజేసి తమ గోడును వెల్లబుచ్చుకున్నారు.