ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏలూరు పోణంగి రోడ్డులో గల వైఎస్ఆర్ కాలనీలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రక్త దానం చేయడం జరిగింది. సచివాలయం డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చేతుల మీద ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఆళ్ళ నాని సీఎం జగన్ మోహన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.