భర్త వేధింపులు భరించలేక భార్య కుమార్తెతో సహా రైలు కిందపడి మృతి చెందిన కేసులో భర్తకు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ ఏలూరు 5వ అదనపు సెషన్స్ కోర్టు జడ్డి రాజేశ్వరి శుక్రవారం తీర్పునిచ్చారు. ఈ ఘటనపై 2016లో ఏలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. లింగపాలెం మండలం బాదరాలకి చెందిన ప్రభావతిని ఆమె భర్త వెంకటేశ్వరరావు తరచూ వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందన్నారు.