రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులతో అన్న దాతలకు ఒరిగేదేమీ లేదని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపునకు నిధులు కేటాయించి రైతు మెడకు ఉరితాడు బిగించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ విమర్శించారు. ఏలూరు అన్నే భవనంలో సోమవారం రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. వెంటనే రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించాలని కోరారు.