డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఏలూరు మెడికల్ కాలేజీకి ప్రకటించడం పట్ల ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ రెడ్డి అప్పల నాయుడు సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఆయన జన్మించిన జిల్లాలోనే ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు ఆయన పేరును పెట్టడం సముచితమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించిన వెంటనే ఆమోదించి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.